News March 4, 2025
MBNR: రైతు వేదికలపై.. సర్కార్ ఫోకస్

రైతు వేదికలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధికారులు ప్రత్యేక నివేదికను స్థానిక ఏఈఓలచే స్వీకరించి ఏర్పాటు చేశారు. MBNR-88, NGKL-142, GDWL-94, WNPT-71, NRPT-77 రైతు వేదికలు ఉండగా.. ఒక్క రైతు వేదిక నిర్మించడానికి రూ.22 లక్షలు ఖర్చయింది. పలు రైతు వేదికలు ధ్వంసం అవ్వగా, మరికొన్ని మౌలిక వసతులు లేవు. నిధులు మంజూరు అయితే మరమ్మతులు చేయించనున్నారు.
Similar News
News March 4, 2025
జర్మనీలో తూ.గో. మంత్రికి ఘన స్వాగతం

జర్మనీ డి బెర్లిన్ ఎక్స్‌పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు జర్మనీలో జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పర్యటక రంగంలో పెట్టుబడులు కోసం ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది. మంత్రితో పాటు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పాల్గొంటారు.
News March 4, 2025
పెద్దపల్లి: LRS ఫీజులపై 25% మినహాయింపు: కమిషనర్

పెద్దపల్లి పట్టణ ప్రజలు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) పరిధిలో ఫీజులు మార్చి 31లోపు చెల్లిస్తే 25% మినహాయింపు పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ఫీజులు చెల్లించి ప్రయోజనం పొందాలని కమిషనర్ కోరారు.
News March 4, 2025
కృష్ణా: వాలంటీర్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.