News February 4, 2025

MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News February 4, 2025

కులగణనతో చరిత్ర సృష్టించాం: సీఎం రేవంత్

image

TG: కులగణన, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ నుంచే రోడ్ మ్యాప్ ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని ప్రకటించారు. కులగణన నివేదికను క్యాబినెట్‌లో ఆమోదించిన ఈరోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామని తెలిపారు. కులగణన విషయంలో తమ నిర్ణయంతో ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు.

News February 4, 2025

ములుగు: తుడందెబ్బ మొదటి మహిళా అధ్యక్షురాలి మృతి

image

తుడుందెబ్బ మొదటి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కండేల మల్లక్క మంగళవారం మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ అస్తిత్వం కోసం పోరాటం చేసి, ఆదివాసులకు హక్కులు కల్పించడంలో ఆమె ఎంతో కృషి చేశారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి అన్నారు. మల్లక్క మృతి ఆదివాసీ సమాజానికి తీరని లోటన్నారు. ఆంధ్ర వలసదారులపై పోరాటం చేసి వెయ్యి ఎకరాల భూమిని ప్రజలకు పంచిదన్నారు.

News February 4, 2025

చారకొండ: బందోబస్తు మధ్య కూల్చివేతలు

image

చారకొండ మండల కేంద్రంలో 167 జాతీయ రహదారి నిర్మాణం కోసం గ్రామంలోని ఊరి మధ్య రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. మంగళవారం పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను జేసిబీలతో ఇళ్లను తొలగించారు. తొలగింపు కార్యక్రమాన్ని తహశీల్దార్ సునీత, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిడిఓ ఇసాక్ హుస్సేన్ కూల్చివేతలు పర్యవేక్షించారు.

error: Content is protected !!