News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 4, 2025
కొంపల్లి: సోదరి చిత్రపటానికి KCR నివాళి
కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ దశదిన కర్మకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సోదరి సకలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. నేడు కేసీఆర్ సహా BRS స్థానిక శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై, నివాళులర్పించారు.
News February 4, 2025
పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: KMR ఎస్పీ
విద్యాబోధన ఒకటే కాదని, పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో ఆమె పాల్గొన్నారు. పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల పట్ల లైంగిక దాడులు జరుగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలన్నారు. లైంగిక వేధింపులకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
News February 4, 2025
తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు
TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల వరంగల్ బీసీ బహిరంగ సభలో రెడ్డిలను తీవ్ర పదజాలంతో దూషించారని, వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో మల్లన్నకు భిక్ష పెట్టారు. మా ఓట్లు పనికిరావని అప్పుడెందుకు చెప్పలేదు? బీసీల కోసం పోరాడటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు?’ అని మండిపడ్డారు.