News February 24, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మూసాపేట్ మండల పరిధిలోని గాజులపేట సమీపంలో జాతీయ రహదారిపై కొత్తకోట, మదనాపూర్ గ్రామాలకు చెందిన చరణ్ (25), అనిల్ (22) బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో గాజులపేట సమీపంలో రహదారిపై వంతెన గోడకు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్థలాన్ని భూత్పూర్ సీఐ రామకృష్ణ పరిశీలించారు.
Similar News
News February 25, 2025
కామారెడ్డి: 100% ఉత్తీర్ణత సాధించాలనేదే లక్ష్యం: కలెక్టర్

పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ రివ్యూ సమావేశంలో మాట్లాడారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఫలితాలు మెరుగుపరచాలన్నారు. విద్యార్థులను విభాగాలుగా విభజించి, దత్తత తీసుకుని ఫలితాలు పెంచేలా కృషి చేయాలని సూచించారు.
News February 25, 2025
మంచిర్యాల: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
News February 25, 2025
హతవిధీ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..!

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే అతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్‌పై వరుస ఓటములతో ఆ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో ఓ ICC టోర్నీ జరుగుతోంది. కానీ ఆ ఆనందాన్ని ఆరు రోజులు కూడా ఆ దేశం నిలుపుకోలేకపోయింది. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. పాక్ ప్రదర్శనపై మీ కామెంట్.