News April 24, 2024

MBNR: లోక్ సభ ఎన్నికల్లో మహిళ ఓటర్లు అధికం

image

రెండు లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులు గెలుపోటములను మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. MBNR పరిధిలో 16,80,417మంది ఓటర్లు ఉండగా వీరిలో 8,48,293(50.48 శాతం) మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. NGKL పరిధిలో మొత్తం 17,34,773మంది ఓటర్లుండగా వీరిలో 8,70,694(50.19 శాతం) మహిళలు ఉన్నారు. కల్వకుర్తి, కొల్లాపూర్ మినహా మిగతా 5 సెగ్మెంట్లలో మహిళలు అధికంగా ఉన్నారు.

Similar News

News April 5, 2026

మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యంశాలు!

image

@మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత
@మహమ్మదాబాద్ లో బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం
@ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
@దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
@భూత్పూర్: 44వ జాతీయ రహదారిపై దారి బోల్తా- డ్రైవర్ కు గాయాలు
@అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు మృతి
@రాజాపూర్ మండల కేంద్రంలో.. చలివేంద్రంను ప్రారంభించిన సర్పంచ్

News April 4, 2026

జడ్చర్ల: అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు మృతి

image

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు రామకృష్ణ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నిరుపేద అయిన బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

News April 4, 2026

నవాబుపేట: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

image

కాకర్లపహాడ్ వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి, పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తిని గుర్తించిన వారు ఎవరైనా ఉంటే నవాబుపేట ఎస్సై విక్రమ్‌కు ఫోన్ ద్వారా 8712659340 సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. బంధువులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఉంటే త్వరగా స్పందించాలని అధికారులు కోరుతున్నారు.