News April 27, 2024

MBNR: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటిద్దాం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు దంచి కొడుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున వృద్ధులు చిన్నారులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* తెలుపు రంగు గల కాటన్ దుస్తులను ధరించండి
* అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రండి
* కళ్లకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ను వాడండి
* దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగండి
* వీలైనంతవరకు ఇంట్లో ఉండండి.

Similar News

News December 28, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన సీఎం, ఉమ్మడి జిల్లా నేతలు✔అభివృద్ధికి సహకరించండి: బండి సంజయ్✔ప్రారంభమైన రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు✔REWIND: పాలమూరుకు అండగా మన్మోహన్ సింగ్✔కార్మికుల హామీలు నెరవేర్చాలి:CITU✔జోగులాంబ అమ్మవారి సేవలో హీరో ఆకాశ్✔కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే✔GREAT:రగ్బీ రాష్ట్ర జట్టుకు కోస్గి విద్యార్థి✔GWDL:Way2Newsతో ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆవేదన

News December 27, 2024

NGKL: మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన సీఎం, ఎంపీ

image

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్ ఎంపీ  మల్లు రవి మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిలో రాష్ట్రానికి చెందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

News December 27, 2024

MBNR: GET READY.. నేటి నుంచి ‘CM CUP-24’ పోటీలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని DSA మైదానంలో సీఎం కప్-2024 పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 1,584 మంది క్రీడాకారులు, 150 మంది అఫీషియల్స్ హాజరుకానున్నారు. 6 మ్యాట్లపై మ్యాచులు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ నెట్ బాల్, కబడ్డీ రాష్ట్రస్థాయి టోర్నీకి అతిథ్యం లభించింది. ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేనెల 2 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.