News October 7, 2025

MBNR: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోండి

image

వరల్డ్ స్కిల్ కాంపిటీషన్-2025లో పాల్గొనేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. ఈ పోటీల్లో 63 కేటగిరీలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చని, ఇవి జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఉంటాయని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://www.skillindiadigital.gov.in

Similar News

News October 7, 2025

కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి విటమిన్ D

image

గర్భస్థ శిశువు ఆరోగ్యానికి విటమిన్ D ఎంతో అవసరమంటున్నారు పరిశోధకులు. ఫీటల్‌ స్కెలిటన్‌ గ్రోత్, ప్లాసెంటా, తల్లి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు D విటమిన్‌ తగినంత ఉండాలని చెబుతున్నారు పెన్‌‌స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు. లేదంటే నెలలు నిండకుండా పుట్టడం, ఫీటల్‌ లెంత్‌ తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>

News October 7, 2025

కన్నడ ‘బిగ్‌బాస్‌’కు షాక్.. నిలిచిపోయిన షో

image

కన్నడ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ షో నిలిచిపోయింది. కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(KSPCB) నోటీసులతో మేకర్స్ షూటింగ్ నిలిపేశారు. షూటింగ్ జరుగుతున్న జాలీవుడ్ స్టూడియోస్‌లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని యాక్టివిస్టులు ఆందోళన చేయడంతో KSPCB చర్యలు తీసుకుంది. స్టూడియో నుంచి వస్తున్న కలుషిత నీటితో స్థానిక ఎకోసిస్టం దెబ్బతింటోందని పేర్కొంది.

News October 7, 2025

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న యుగంధర్‌ని పదోన్నతిపై కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా వెంకట్రావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో యుగంధర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.