News March 24, 2025
MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్‌తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 4, 2025
మందమర్రి: ‘మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి’

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ బోర్డు నిర్వహించకుండా కార్మికులను అయోమయానికి గురి చేస్తోందని టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు విమర్శించారు. అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సింగరేణి కుటుంబాల్లో వెలుగులు నింపిన దేవుడన్నారు. కారుణ్య నియామకాల ద్వారా 19 వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో కార్మికులకు ఉద్యోగ భద్రత కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.
News November 4, 2025
‘ఇండియా’ గ్లోబల్ సూపర్ పవర్: ఇజ్రాయెల్ మంత్రి

ఇండియా ‘గ్లోబల్ సూపర్ పవర్’ కంట్రీ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ అభివర్ణించారు. 2 దేశాల సంబంధాలు గతంలో కన్నా మరింత బలపడ్డాయని NDTVతో చెప్పారు. డిఫెన్స్, ట్రేడ్, కౌంటర్ టెర్రరిజమ్, ట్రేడ్‌లలో తమ బంధాన్ని విస్తరించామన్నారు. హమాస్ దాడి సమయంలో మద్దతుగా నిలిచిన ఇండియాను ఎప్పుడూ గుర్తుంచుకుంటామని తెలిపారు. తమకు ముప్పుగా ఉన్న పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించలేమన్నారు.
News November 4, 2025
మంచిర్యాల జిల్లా జట్టుకు మొదటి స్థానం

దండేపల్లి మండలం రెబ్బనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి SGF అండర్-14 వాలీబాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో 4 జిల్లాల నుంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట స్థాయికి పోటీలకు ఎంపిక చేసినట్లు SGF సెక్రటరీ యాకూబ్ తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.


