News March 26, 2025
MBNR: వలస కార్మికులకు నివాసయోగ్యమైన ప్రభుత్వ పాఠశాలలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ మండలం (వెంకటాపూర్) అవతలిగడ్డ తండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వలస కార్మికులకు నివాస యోగ్యమైంది. సరస్వతి నిలయాల్లో వలస కార్మికులు మద్యం, గుట్కా, ధూమపానం సేవిస్తూ పాఠశాల మౌలిక వసతులను అపరిశుభ్రం చేసి, ధ్వంసం చేస్తున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు మూతబడిన పాఠశాలను వెంటనే తెరిపించి, బడి బయట ఉండే విద్యార్థులను పాఠశాలలో చేరే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 16, 2025
విశాఖలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

జీవీఎంసీ, VMRDA సంయుక్తంగా చేపడుతున్న పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నారాయణ సూచించారు. VMRDA కార్యాలయంలో అర్ధరాత్రి వరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, VMRDA కమిషనర్ తేజ్ భరత్, అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. లేఔట్‌లో మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.
News November 16, 2025
ఖమ్మం: లోక్ అదాలత్‌లో 4,635 కేసులు పరిష్కారం

కేసుల రాజీతో కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. రాజగోపాల్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహించారు. మొత్తం 4,635 కేసులను పరిష్కరించారు. వీటిలో క్రిమినల్ కేసులు 596, ఈ పెట్టి కేసులు 2, 350, చెక్ బౌన్స్ 53, ఇతర కేసులు 1,636 ఉన్నాయి. పరిష్కారం చేసుకున్న కక్షిదారులకు పూల మొక్కలు, అవార్డులు బహూకరించారు.
News November 16, 2025
134 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భారత వాతావరణ శాఖ(IMD) 134 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. PhD, ME, M.Tech కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


