News March 27, 2025
MBNR: సంక్షేమ పథకాలు లక్ష్యం మేరకు పూర్తి చేయండి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు బుధవారం కలెక్టర్ మిడ్జిల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలపై ముందుగా సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 30, 2025
NGKL: దిగుబడి రాలేదని కౌలు రైతు ఆత్మహత్య

మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవల్ తిరుమలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనమోని శ్రీనివాసులు అనే రైతు కల్వకుర్తి మండలం వేపూరు గ్రామంలో మామిడి తోటను కౌలు చేస్తున్నాడు. దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
News March 30, 2025
MBNR: నేడు, రేపు పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

ఆది, సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు.
News March 30, 2025
MBNR: జిల్లా కోర్టులో డిజిటలైజేషన్ సేవలు: శ్రీదేవి

జిల్లా కోర్టులో డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ సేవల్ని శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి ప్రారంభించారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమెకు ఆర్అండ్బీ అతిథిగృహంలో జిల్లా జడ్జి పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకిలు పుష్పగుచ్ఛాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఉన్నారు.