News March 31, 2025
MBNR: సర్వం సిద్ధం.. నేడే రంజాన్ పండుగ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో నేడు ముస్లింలు రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) నిర్వహించుకోనున్నారు. ఇప్పటికే ఈద్గాలు, మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 30 రోజులుగా దీక్షలు చేస్తున్న ముస్లింలు నెల వంక కనిపించటంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ చాంద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Similar News
News December 24, 2025
ఢిల్లీ మెట్రోకు కేంద్రం నిధులు.. TG ఎదురుచూపు!

ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 16km మేర ఢిల్లీ మెట్రో విస్తరణకు రూ.12,015 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా నిరీక్షిస్తున్న హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో HYD మెట్రో విస్తరణ మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం మెట్రోను అధీనంలోకి తీసుకోనున్నట్లు ఇప్పటికే తెలిపింది. ప్రస్తుతం HYDలో 69.2km మెట్రో మార్గం విస్తరించి ఉంది.
News December 24, 2025
కేజీ రూ.3,00,000.. ఎంతో దూరం లేదు!

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. కేజీ సిల్వర్ రేటు ఈ ఏడాది జనవరిలో రూ.90వేలు ఉండగా ఏకంగా రూ.1.54 లక్షలు పెరిగి రూ.2,44,000కు చేరింది. ఇదే జోరు కొనసాగితే కిలో రూ.3లక్షలకు చేరడానికి ఇక ఎంతో కాలం పట్టదని నిపుణులు చెబుతున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,38,930 ఉండగా అతి త్వరలోనే రూ.1,50,000 మార్క్ చేరొచ్చని అంచనా వేస్తున్నారు. మీరేమంటారు?
News December 24, 2025
H-1B వీసా కొత్త రూల్: ఎవరికి లాభం?

H-1B వీసాల జారీలో ఏళ్లుగా అనుసరిస్తున్న లాటరీ సిస్టమ్‌ను ఆపేసి మంచి స్కిల్స్ ఉండి అధిక వేతనం వచ్చే వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2026 నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డాక్టర్ల వంటి హైస్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు ప్రాముఖ్యత ఇస్తారు. తక్కువ జీతం ఉండే అన్‌స్కిల్డ్ వర్క్ కోసం US వెళ్లాలనుకునే వారికి అవకాశాలు తగ్గొచ్చు. కంపెనీలు తక్కువ జీతం కోసం కాకుండా టాలెంట్ ఉన్నవారికే వీసాలు ఇచ్చేలా ఈ మార్పులు చేశారు.


