News March 20, 2025

MBNR: సీఎం మానస పుత్రికకు నిధులేవి..?: నరసింహ

image

నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని జల సాధన సమితి కో కన్వీనర్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన మానస పుత్రికగా చెప్పుకునే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించిన విషయం గుర్తుపెట్టుకుని జిల్లా అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.

Similar News

News March 21, 2025

హనీ‌ట్రాప్: అసెంబ్లీకి వీడియో CDలు తీసుకొచ్చిన BJP నేతలు

image

కర్ణాటక అసెంబ్లీని హనీట్రాప్ వివాదం కుదిపేస్తోంది. వలపు వలలో చిక్కిన 48 నేతల పేర్లను బయటపెట్టాలని ప్రతిపక్ష BJP డిమాండ్ చేస్తోంది. ఇదిగో ప్రూఫ్ అంటూ వీడియో CDలు పట్టుకొని CM సిద్దరామయ్య ముందు నిరసన వ్యక్తం చేసింది. నేతలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన నిర్వహిస్తున్నా పట్టించుకోని సీఎం తలదించుకొని యథావిధిగా తన ప్రసంగం కొనసాగించారు. వివాదంపై అత్యున్నత స్థాయిలో విచారణ జరిపిస్తామని ప్రకటించారు.

News March 21, 2025

వరంగల్: చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ముందస్తు సమాచారం సేకరించాలి

image

చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించడం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ప్రధాన కర్తవ్యం అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ఏమీ జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలన్నారు. రౌడీ షీటర్లు ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయాలని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

News March 21, 2025

వరంగల్: భద్రకాళి చెరువు పనులను పరిశీలించిన మంత్రి

image

భద్రకాళి చెరువు పూడికతీత పనులను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, కెఆర్ నాగరాజు, గుండు సుధారాణి కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావిణ్య, కమిషనర్ అశ్విని తానాజీ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!