News March 11, 2025
MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్‌లో ఓ గ్రూప్‌లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News December 20, 2025
ASF: బీటీ రోడ్డు కోసం హైదరాబాద్‌కు పాదయాత్ర

దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారని లింగాపూర్ మండలం పులసింగ్ గ్రామానికి చెందిన జై చాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగాపూర్–పంగిడి మదొర వరకు మంజూరైన బీటీ రోడ్డు పనులు టెండర్లు పూర్తైనా ప్రారంభం కాలేదన్నారు. రోడ్డు లేక అనారోగ్య సమయంలో ఆసుపత్రికి చేరలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయన్నారు. రోడ్డు సాధనకై రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
News December 20, 2025
డిసెంబర్ 20: చరిత్రలో ఈరోజు

1934: వ్యవసాయ శాస్త్రవేత్త ఈడుపుగంటి వెంకట సుబ్బారావు జననం
1940: శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి జననం (ఫొటోలో)
1951: కథారచయిత కన్నేపల్లి చలమయ్య జననం
1988: సినీ నటి బి.జయమ్మ మరణం
☛ అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం
News December 20, 2025
భారత్ VS సౌతాఫ్రికా T20 సిరీస్ హైలైట్స్

➻ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: వరుణ్ చక్రవర్తి(10 వికెట్లు)
➻ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(5వ T20): హార్దిక్ పాండ్య(25 బంతుల్లో 63)
➻ గత 7 సిరీసులు: 3 డ్రాలు, 4 విజయాలతో భారత్ ఆధిపత్యం
➻ 2015 అక్టోబరులో చివరిసారి భారత్‌పై గెలిచిన SA
➻ గత 35 మ్యాచు(టీ20)ల్లో SAపై భారత్ 21 సార్లు గెలుపు


