News March 19, 2025

MBNR: సొంత జిల్లాపై సీఎం కరుణ చూపేనా..?

image

అసెంబ్లీలో నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఉమ్మడి MBNR జిల్లా ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రెండు దశాబ్దాలుగా పూర్తికాని నెట్టెంపాడు ప్రాజెక్టు, దానికి గుండెకాయగా ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలు, సంగంబండ ప్రాజెక్టు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల కింద పంప్‌హౌస్‌ల పూర్తి కావాల్సి ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కొడంగల్-పేట ఎత్తిపోతల పథకాల నిధుల కేటాయింపుపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News February 22, 2026

అమలాపురం: రౌడీలకు పోలీసుల క్లాస్

image

జిల్లాలో రౌడీయిజం, గూండాయిజం అణచివేతకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. SP రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. పాత నేర చరిత్రను విస్మరించి, సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా జీవించాలని పోలీసులు సూచించారు. ప్రవర్తన మార్చుకోని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 22, 2026

ఉయ్యాలవాడకు నివాళులర్పించిన పోలీసులు

image

తెలుగునేల గర్వించదగ్గ తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి ఆదేశాలతో అదనపు ఎస్పీ వెంకటాద్రి, సిబ్బంది నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాలర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలు చేశారన్నారు.

News February 22, 2026

స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ (పర్సనల్) రాజీనామా ?

image

స్టీల్ ప్లాంట్‌లో డైరెక్టర్ (పర్సనల్)గా పనిచేస్తున్న రాకేశ్ నందన్ సహాయ్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 10న బాధ్యతలు స్వీకరించిన ఆయన తక్కువ వ్యవధిలోనే తప్పుకోవడంపై చర్చ నడుస్తోంది. గతంలో NTPC, Indian Oil Corporation, Coal India Limitedలో కీలక పదవుల్లో పనిచేశారు. స్టీల్ ప్లాంట్‌లో నెలకొన్న పరిపాలన పరిస్థితుల కారణంగానే ఆయన రాజీనామా చేసి ఉండవచ్చని కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతుంది.