News July 8, 2025

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కుసుమ కుమార్

image

స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్‌ఛార్జ్‌‌గా కుసుమ కుమార్‌ను నియమిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈయన గతంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, జాతీయస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. పలు రాష్ట్రాల్లో పార్టీ నుంచి ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Similar News

News July 8, 2025

బడిబాటలో హైదరాబాద్ టాప్

image

బడిబాట‌లో హైదరాబాద్‌ రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడడంతో ఆదరణ పెరుగుతోంది. అధికారుల విస్తృత ప్రచారంతో కొత్త అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ఈ ఏడాది గవర్నమెంట్ స్కూల్లో 1st క్లాస్‌లో HYD-6359, మేడ్చల్‌- 2962, రంగారెడ్డి-2127 అడ్మిషన్లు వచ్చాయి. ఇక 2వ తరగతి నుంచి పదో తరగతి వరకు HYD-9,674, మేడ్చల్‌-5262, రంగారెడ్డి-3642 మంది విద్యార్థులు సర్కారు బడిలో చేరారు.

WGL: నేడు 118 విద్యాలయాల్లో ‘స్ఫూర్తి’

image

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో స్ఫూర్తి
కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 విద్యాలయాల్లో బ్యాంకర్లు, జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లు సమాజంలో జరుగుతున్న సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.