News March 1, 2025
MBNR: హక్కుల కోసం కలిసి ముందు కెళ్దాం: మాజీ మంత్రి

గౌడ్స్ హక్కుల కోసం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు. HYD నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్‌లో గౌడ్ సంఘాల నాయకులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. మహాసభ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్దామన్నారు. నీరా కేఫ్ పై ప్రభుత్వంలో కదలిక రావడం సంతోషమన్నారు. షరతులు లేకుండా నీరా కేఫ్‌ని టాడీ కార్పొరేషన్‌కి అందించాలన్నారు.
Similar News
News November 11, 2025
సీసీ కుంట: కురుమూర్తి జాతరలో రోడ్డు ప్రమాదం

చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ గురుమూర్తి స్వామి జాతర మైదానంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న బైక్, ఆటో ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇచ్చినా ఆలస్యం కావడంతో క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడినవారు డోకుర్ బైక్, పేరూరు ఆటో డ్రైవర్లుగా పోలీసులు గుర్తించారు.
News November 11, 2025
జడ్చర్ల: విద్యార్థి పై దాడి..బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు

జడ్చర్ల పట్టణంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడంతో కర్ణభేరి దెబ్బతిని చెవికి గాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిపై, పాఠశాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ బాలల హక్కుల సంఘానికి, మానవ హక్కుల సంఘానికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థికి తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 11, 2025
MBNR: ఖో-ఖో సెలక్షన్స్.. విజేతలు వీరే..!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాల, బాలికలకు ఖో-ఖో ఎంపికలు నిర్వహించారు. మొత్తం 550 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఎంపికైన వారిని ఉమ్మడి జిల్లా స్థాయికి పంపించారు.
✒బాలికల విభాగం
1)మొదటి బహుమతి:బాలానగర్
2)రెండవ బహుమతి:మహమ్మదాబాద్
✒బాలుర విభాగం
1)మొదటి బహుమతి:నవాబ్ పేట్
2)రెండో బహుమతి:కోయిలకొండ


