News July 4, 2024
MBNR: 100 మంది విద్యార్థులు.. ఒక్కరే టీచర్
కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతి వరకు 100 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గతంలో ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేశారు. హిందీ ఉపాధ్యాయుడు కొత్తకోటలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 4లో బదిలీల్లో 3 ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రజిత ఒక్కరే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News October 7, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా విలియంకొండలో 34.8 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 34.5 డిగ్రీలు, గద్వాల జిల్లా రాజోలిలో 33.1 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 31.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News October 7, 2024
మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్‌నగర్‌లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <
News October 7, 2024
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..!
శ్రీశైలం జలాశయానికి ఆదివారం ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతుంది. జూరాల గేట్ల ద్వారా 21,603, విద్యుదుత్పత్తి చేస్తూ 37,252, సుంకేసుల నుంచి 26,874 మొత్తం 85,756 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వస్తుంది. దీంతో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, AP జెన్కో పరిధిలోని కుడి గట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ14,379 మొత్తం 49,694 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.