News August 22, 2024
MBNR: 1041 మంది మహిళలపై అత్యాచారం
రాష్ట్రంలో మహిళపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, పోక్సో, అదృశ్యం జనవరి నుంచి కేసుల నమోదు వివరాలు. మహబూబ్‌నగర్‌లో 406, వనపర్తిలో 230, గద్వాల జిల్లాలో 157, నారాయణపేట్ 152, నాగర్ కర్నూల్‌లో 96 పోక్సో, అత్యాచారం, అదృశ్యం కేసులు నమోదు అయ్యాయి. చట్టాలు కఠినంగా అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News November 27, 2024
ప్రధాని మోదీతో ఎంపీ డీకే అరుణ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రధాని నిర్వహించిన కీలక సమావేశంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు.
News November 27, 2024
MBNR: ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించిన సీఎం
న్యూఢిల్లీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, గన్ని సంచులు, ప్యాడీ క్లీనర్స్, అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్ లైన్‌లో నమోదు చేసి రైతులకు వెంటవెంటనే డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 26, 2024
మాగనూరు: జిల్లా పరిషత్ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్
మాగనూరు మండల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతమైంది. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన పునరావృతం అవ్వడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.