News March 26, 2025
MBNR: 1052 మంది రక్తదానం చేశారు: నటరాజు

షహీద్ దివస్ను పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ సంస్థలు, కళాశాలలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాల్లో మొత్తం 1052 మంది యువత రక్తదానం చేశారని ఐఆర్సీఎస్ ఛైర్మన్ నటరాజు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రక్తదాన శిబిరాలను నిర్వహించగా.. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని తెలిపారు.
Similar News
News March 30, 2025
MBNR: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎస్పీ జానకి ధరావత్ శనివారం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితం తీపి, చేదుల సమ్మేళనం అయినప్పటికీ కూడా అవన్నీ మన అభ్యున్నతికి పునాదులుగా నిలవాలన్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా పండగలు చేసుకోవాలని సూచించారు. రైతాంగానికి సంపూర్ణమైన ఫలితాలు దక్కి రాష్ట్రంలో వ్యవసాయం ఎంతో పురోగతి సాధించాలని కాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.
News March 30, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

❤అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి:CM రేవంత్ రెడ్డి❤మన్యంకొండ దేవస్థానానికి పోటెత్తిన భక్తులు❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు❤కొడంగల్ ప్రజలు రాష్ట్రన్ని పాలించే శక్తిని ఇచ్చారు: సీఎం❤ఉగాది,రంజాన్ EFFECT.. రద్దీగా మారిన బస్టాండ్లు❤సింగపూర్ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ❤రేపే ఉగాది వేడుకలు❤NGKL:మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
News March 29, 2025
అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి: CM రేవంత్

రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలతో అల్లాను కొలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొడంగల్ పట్టణంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన “రంజాన్ ఇఫ్తార్ విందు”లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.