News July 8, 2024
MBNR: 14న జగన్నాథ రథయాత్ర మహోత్సవం

శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవం పాలమూరులో ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ఎం.యాదిరెడ్డి, రాజమల్లేశ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు పాలమూరు భక్త బృందం ఆధ్వర్యంలో కీర్తనలు, నృత్యాలు, భజనలు, కోలాటాలతో పరమాద్భుతమైన ఉత్సవంగా జరగనుందని చెప్పారు.
Similar News
News February 24, 2026
MBNR: పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు!

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు 13 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 2 స్వర్ణ, 3 రజత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. విజేతలను జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాకు కీర్తి తెచ్చిన క్రీడాకారుల ప్రతిభను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.
News February 24, 2026
జడ్చర్ల: భార్యభర్తల గొడ.. కత్తితో దాడి

భార్య, భర్త గొడవపడి ఇద్దరి అత్తలపై కత్తితో దాడి చేసిన ఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో జరిగింది. సోమవారం రాత్రి పోలేపల్లికి చెందిన అలివేలు, రవి దంపతులు గొడవపడ్డారు. గొడవ ఆపేందుకు వచ్చిన అత్తలు శ్యామలమ్మ, అంజమ్మలపై రవి కత్తి మొఖం, కడుపులో దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News February 23, 2026
MBNR: పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.


