News November 10, 2024
MBNR: 14 కాలేజీలో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీ
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 14 జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NGKL జిల్లాలో 4, WNP జిల్లాలో 5, GDWL జిల్లాలో 3, NRPT జిల్లాలో 2 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
Similar News
News December 8, 2024
మా హయంలో భీమా సౌకర్యం కల్పించాం: శ్రీనివాస్ గౌడ్
హోమ్ గార్డుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదో ఉద్ధరిస్తారని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారనుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ నిన్న రూ. 79 పెంచి రూ. 1000 జీతం పెంచామని గొప్పలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేము అధికారంలో ఉన్నప్పుడే హోమ్ గార్డులకు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.
News December 8, 2024
ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. గత 3 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగాNRPT జిల్లాలోని దామరగిద్ద మండల కేంద్రంలో 12డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12.0నుంచి 26.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News December 8, 2024
‘నిబంధన నామమాత్రమే.. క్రీడల్లో రాణించేది మనమెప్పుడు’
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,227 ప్రభుత్వ పాఠశాలలుంటే 3.50 లక్షల మంది విద్యార్థులు, 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా..17,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 275 మంది PEDలు, 45 మంది PETలు మాత్రమే ఉన్నారు.250 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండాలన్న నిబంధన నామమాత్రమే. ప్రభుత్వం క్రీడలపై దృష్టి పెట్టి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కోరుతున్నారు.