News November 11, 2025

MBNR: 150 ఉద్యోగాలు.. సద్వినియోగం చేసుకోండి

image

మహబూబ్ నగర్ లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో (పిల్లలమర్రి) ఈనెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ ‘Way2News’తో తెలిపారు. 4 ప్రైవేట్ సంస్థలలో 150 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, వయసు 18-30లోపు ఉండాలని, ఆధార్, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఉమ్మడి జిల్లా అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 11, 2025

రక్షణ చట్టం వచ్చేవరకు మా అడుగులు ఆగవు- న్యాయవాదుల

image

న్యాయవాదుల భద్రత దేశ న్యాయవ్యవస్థ గౌరవానికి మూలం. రక్షణ చట్టం అమలు అయ్యే వరకు మా అడుగులు ఆగవు అని న్యాయవాద సంఘ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం గవ్వల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ‘న్యాయవాదుల రక్షణ – చలో హైదరాబాద్’ పాదయాత్ర మూడో రోజు బీచుపల్లి శ్రీరామాలయం ప్రాంగణంలో ప్రార్థనలతో ప్రారంభమైంది. ‘న్యాయవాది రక్షణ చట్టం – ఇప్పుడే అమలు చేయాలి’ అంటూ పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన యూపీ మహిళ Dr.షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్‌కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్‌ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

News November 11, 2025

విజయవాడ: 11 గంటలైనా ఈ ప్రభుత్వ ఆఫీసుకి ఉద్యోగులు రారు!

image

విజయవాడ బందర్ రోడ్‌లోని పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం జిల్లా కార్యాలయంలో 18 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉదయం 11 గంటలు అయినప్పటికీ కేవలం ఆరుగురు మాత్రమే ఆఫీసుకు వచ్చారు. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన సమయం 10గంటలు కాగా.. వారంలో సగం రోజులకు పైగా 11 గంటల వరకు ఉద్యోగులు రావడం లేదని ఆరోపణలున్నాయి. ప్రభుత్వ కార్యాలయం కదా ఎప్పుడొచ్చినా అడిగే వారు ఎవరులే అన్నట్లు అధికారులు తీరు కనిపిస్తోంది.