News December 16, 2025

MBNR: 16న..U-19 షటిల్ బ్యాట్మెంటన్ ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు షటిల్ బ్యాట్మెంటన్ ఎంపికలను ఈనెల 16న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు పీడీ సాదత్ ఖాన్ (89198 71829)కు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT.

Similar News

News December 18, 2025

MBNR: రేపు అంబులెన్స్‌ డ్రైవర్ల నియామకానికి ఇంటర్వ్యూలు

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 102 అంబులెన్స్‌ల్లో డ్రైవర్ల నియామకానికి ఈ నెల 19న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం, బ్యాడ్జి నంబర్ కలిగి ఉన్న 35 ఏళ్లలోపు వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా ఆసుపత్రిలోని 108 కార్యాలయంలో హాజరు కావాలి. 9491271103ను సంప్రదించాలని ఆయన కోరారు.

News December 17, 2025

MBNR జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే.!

image

పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి ఫలితం వెలువడింది. భూత్పూర్ మండలం లంబాడికుంట తండా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాన్య నాయక్ ఘనవిజయం సాధించారు. BRS మద్దతుతో పోటీ చేసిన ఆయన, ప్రత్యర్థులపై ఆధిక్యం కనబరిచి విజేతగా నిలిచారు. జిల్లాలో వెలువడిన మొదటి ఫలితం ఇదే కాగా అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. గ్రామంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

News December 17, 2025

MBNR జిల్లాలో 81.44 శాతం ఓటింగ్.. లెక్కింపు ప్రారంభం

image

MBNR జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లా వ్యాప్తంగా 81.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,16,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ముగిశాయి. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సా.5 గంటల వరకు ఫలితాలు వెలువడనున్నాయి.