News March 18, 2025
MBNR: 16 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున 16 గ్రామాలను ఎంపిక చేశామని అక్కడ వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయో నివేదిక పంపించాలని ఆమె ఆదేశించారు.
Similar News
News March 18, 2025
MBNR: కట్నం వేధింపులతో ఆత్మహత్య.. తల్లి ఫిర్యాదు

జడ్చర్ల మండలంలో నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకి చెందిన చర్చిత(23)కు రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌తో జనవరి31న పెళ్లి జరిగింది. వధువు తల్లిదండ్రులు పెళ్లికి రావాలంటే రూ.10లక్షలు వరకట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయటంతో వారు పెళ్లికి రాలేదు. పెళ్లి తర్వాత అత్త, మామలు వేధింపులకు గురిచేయటంతో చర్చిత ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.
News March 18, 2025
జడ్చర్ల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఫినాయిల్ తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కి చెందిన పెంటయ్య(62) ఆదివారం ఇంట్లో బాత్‌రూమ్‌కి వెళ్లి అక్కడ తాగునీళ్లు అనుకుని ఫినాయిల్ తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈమేరకు కేసు నమోదైంది.
News March 18, 2025
MBNR: కారు టైర్ పగిలి రోడ్డు ప్రమాదం.. తాత, మనవడు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై<<15788272>> ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. NGKL జిల్లా బిజినేపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి(76) MBNRలో నివాసముంటున్నారు. ఆయన కూతురు శ్వేత(45), ఈమె కొడుకు నిదయ్‌రెడ్డి(22)లు HYDలో ఉంటున్నారు. వీరు ముగ్గురు కారులో HYD నుంచి జడ్చర్లకు వస్తున్నారు. మాచారం సమీపంలో టైరుపగిలి అవతలివైపు వస్తున్న బస్సును ఢీకొట్టగా తాత, మనవడు మృతిచెందారు. శ్వేత పరిస్థితి విషమంగా ఉంది.