News June 20, 2024
MBNR: 229 మంది SAలు, GHMలకు పదోన్నతులు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 229 మంది ఎస్ఏలు, జీహెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు, ఎన్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతలు, ఎస్జీటీల బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని 3,230 పాఠశాలల్లో 12,708 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. వారిలో సుమారు 700 మందికి పదోన్నతులు పొందనుండగా మరో 8 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
Similar News
News January 13, 2025
కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కల్వకుర్తిలోని <<15140785>>లారీ ఢీకొట్టిన<<>> ఘటనలో ఒకరు మృతిచెందారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు, వంగూర్ మం. కోనేటిపురం వాసి శ్రీను రాచూరులోని కాఫీ కంపెనీలో పనిచేస్తున్నారు. అదివారం రాత్రి సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదుట కంపెనీ వాహనం కోసం వేచి ఉండగా లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగరాజు లారీ టైర్ల కిందపడి చనిపోగా శ్రీనును ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 13, 2025
విద్యాసంస్థల్లో మతోన్మాదుల జోక్యం అడ్డుకోవాలి: ప్రొ.హరగోపాల్
పాఠశాలల్లో మతోన్మాదుల జోక్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. మతాలకు సంబంధించిన చిహ్నాలు, దుస్తులను విద్యాసంస్థల్లో నిషేధించాలని కోరారు. తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం రాములుపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
News January 13, 2025
మంద జగన్నాథం మృతి పట్ల సీఎం సంతాపం
నాగర్కర్నూల్ మాజీ MP మంద జగన్నాథం మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు లోక్సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. వారి మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. జగన్నాథం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.