News March 24, 2025
MBNR: 24న ఆశావర్కర్స్ ‘చలో హైదరాబాద్’

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆశా కార్యకర్తలు CITU ఆధ్వర్యంలో తమ సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ.. కార్మికులకు రూ.18 వేతనం, పీఎఫ్, ఈపీఎఫ్, గ్రాటివిటీ, పెన్షన్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆశాకార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 31, 2025
మహబూబ్‌నగర్: రంజాన్ పండుగ భద్రతను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ఈద్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. శాంతిభద్రతలు, ప్రజల సౌకర్యం, శాంతియుతం,ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణ, అత్యవసర సేవల ఏర్పాట్లు ఈద్గా, మసీదులు ప్రధాన కూడళ్ల వద్ద అదనపు బందోబస్తు అంశాలపై అధికారులతో సమీక్షించారు.
News March 31, 2025
మహబూబ్‌నగర్: భారీ ధర్నాకు బీసీ సంఘం: గోనెల శ్రీనివాసులు

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.
News March 31, 2025
మహబూబ్‌నగర్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

మహబూబ్‌నగర్ రూరల్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ముస్లిం ప్రజలు రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వ మానవ సమానత్వానికి, పవిత్రకు, త్యాగానికి, దాతృత్వానికి, మతసామరస్యానికి ప్రతీకలని వారన్నారు. కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.