News June 24, 2024
MBNR: 25 నుంచి జాతీయ నెట్ బాల్‌కు శిక్షణ
ఆసియా నెట్ బాల్ మహిళా టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు 20 రోజుల పాటు నిర్వహించే శిక్షణ శిబిరం MBNRకు మంజూరైందని రాష్ట్ర కార్యదర్శి ఖాజా ఖాన్ తెలిపారు. ఈ నెల 25న డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్నామని, సౌదీ అరేబియా దేశం జెడ్డాలో సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 7 వరకు ఆసియా నెట్ బాల్ మహిళా టోర్నీ జరుగుతుందని, ఇందులో భారత్‌తో పాటు మరో 15 ఆసియా దేశాల జట్లు పాల్గొంటాయన్నారు.
Similar News
News November 5, 2024
MBNR: ‘సర్వేకు ప్రజలు సహకరించాలి’
జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MBNR కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. సోమవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి ఇండ్ల జాబితా, యజమాని, చిరునామా వివరాలు సేకరించి ఇంటికి సర్వే స్టిక్కర్ అతికిస్తామన్నారు. సర్వే నిర్వహించేందుకు ఇంటికి వచ్చిన సిబ్బందికి ఆధార్, రేషన్, కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు తదితర సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News November 4, 2024
ఉమ్మడి పాలమూరుTOP NEWS
✔MBNR: పెట్టుబడులే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాల MLAల విదేశీ పర్యటన ✔ సౌత్ జోన్ ఎంపికలు వాయిదా✔వనపర్తిలో సినీనటి అనసూయ సందడి✔పెండింగ్ బిల్లులపై.. మాజీ సర్పంచ్లు అరెస్టులు✔ప్రారంభమైన పత్తి,వరి కొనుగోలు కేంద్రాలు✔గండీడ్:రేపు 38 గ్రామాల్లో తాగు నీళ్లు బంద్✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్✔ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు మీ సేవలు బంద్✔పలుచోట్ల కార్తిక శోభ.. ఆలయాల్లో భక్తుల సందడి
News November 4, 2024
MBNR: ‘ధాన్యం రోడ్లపై ఆరబోసి మరణానికి కారణం కావొద్దు’
రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి వాహనదారుల మృతికి కారకులు కావద్దని MBNR ఎస్పీ జానకి సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబోసి నల్లని కవర్లు కప్పడంతో రాత్రివేళలో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని పేర్కొన్నారు. కావున రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, బావుల వద్దనే ధాన్యం ఆరబోసుకోవాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఎవరైనా రోడ్లపై ధాన్యాన్ని పోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.