News March 7, 2025

MBNR: 25% రాయితీ పొందండి: స్పెషల్ కలెక్టర్

image

ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించుకొని ప్రభుత్వం కల్పించిన 25% శాతం రాయితీని పొందాల్సిందిగా స్పెషల్ కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి శివేంద్ర ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ లో చేసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్ లైన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. పరిశీలించారు హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించి తమ దరఖాస్తులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు.

Similar News

News March 7, 2025

దేవరకద్ర‌లో ఓ అరుదైన నిమ్మకాయ.!

image

దేవరకద్ర మండలంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఓ కూల్‌ డ్రింక్స్ నిర్వాహకుడు కొన్ని నిమ్మకాయలను కొనుగోలు చేశారు. అందులో ఓ అరుదైన నిమ్మకాయ కనిపించింది. ఏకంగా పెద్ద సంత్రపండు సైజులో ఉంది. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది పెద్ద సంత్ర పండు సైజులో ఉన్న నిమ్మకాయను చూడటానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. ఓ నిమ్మకాయ ఇంత పెద్ద సైజులో ఉండేలా చూడటం ఇదే మొదటి సారి అని నిర్వాహకుడు తెలిపారు.

News March 7, 2025

గౌతాపూర్ మాజీ సర్పంచ్ మృతి

image

బాలానగర్ మండలంలోని గౌతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మల్లెకేడి యాదగిరిజీ అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. ఈయన 2009-2014 వరకు గ్రామ సర్పంచిగా పనిచేశాడు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరి.. 2014 ఆగస్టులో ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు.

News March 7, 2025

కొత్తకోట: రోడ్డు ప్రమాదంలో సీడీసీ ఛైర్మన్ మృతి

image

సీడీసీ ఛైర్మన్ పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి(55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సాకారంతో ఉమ్మడి జిల్లా సీడీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కొత్తకోటతో పాటు కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి.

error: Content is protected !!