News November 24, 2024
MBNR: 29న దీక్షా దివస్, వైస్ ఇన్‌ఛార్జిల నియామకం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్న సందర్భంగా ఆయా జిల్లాలకు వైస్ ఇన్‌ఛార్జి లాను బీఆర్ఎస్ నియమించింది. MBNR జిల్లాకు కేమ మల్లేష్, NRPT ఎమ్మెల్సీ కోటి రెడ్డి, GDWL మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రెడ్డి, WNP మాజీ జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, NGKLకు మాజీ ఎమ్మెల్సీ విజయ సింహ రెడ్డిలను నియమించారు.
Similar News
News December 9, 2024
MBNR: TCC కోర్సు.. మరో అవకాశం!!
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయా జిల్లాల డీఈవోలు తెలిపారు. డ్రాయింగ్ కోర్సు-లోయర్ రూ.100, హయ్యర్ రూ.150, ఎంబ్రాయిడరింగ్, టైలరింగ్ కోర్సు-లోయర్ రూ.150, హయ్యర్ రూ.200ను ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 10లోగా చెల్లించాలని, 10వ తరగతి ఉత్తీర్ణత అయిన అర్హులన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 9, 2024
ఉమ్మడి పాలమూరులో నేటి..TOP NEWS!
✔మా జీతాలు పెంచండి సీఎం సారు:TUCI✔గట్టు: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి✔మా హయంలో భీమా సౌకర్యం కల్పించాం: శ్రీనివాస్ గౌడ్✔రాజోలి: సుంకేసుల బ్యారేజీ గేట్లు క్లోజ్✔ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు✔PUలో సౌత్ జోన్ ఎంపికలు✔NGKL:రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు✔పలు మండలాలలో సర్వే పూర్తి✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔మహా పడిపూజలో ఎంపీ డీకే అరుణ, ఉమ్మడి జిల్లా నేతలు✔సీఎంను కలిసిన జిల్లా నేతలు
News December 8, 2024
‘మతాలకతీతంగా మనిషిని ఆవిష్కరించేదే కవిత్వం’
మతాలకతీతంగా మనిషిని ఆవిష్కరించేదే కవిత్వం అని ప్రముఖ కవులు జనజ్వాల అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త కే లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర మహాసభలు ఈనెల 14న MBNRలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మతం కంటే ముందు మనుషులని, మానవత్వమే సమాజ ప్రగతికి దోహదపడుతుందని తెలిపారు.