News May 18, 2024

MBNR: 3,21,523 ఎకరాల్లో పంటలు సాగు

image

వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 3,21,523 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. వరి 1,70,445 ఎకరాల్లో సాగు కానుండగా.. 42,612 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా పత్తి 85,379 ఎకరాల్లో సాగు కానుండగా.. 853.79 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచాలని ప్రణాళిక రూపొందించారు. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు.

Similar News

News December 11, 2024

PU డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్.. ఈనెల 21 నుంచి పరీక్షలు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ విడుదలైంది. డిగ్రీ 1వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 25 నుంచి జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలను డిసెంబర్ 21 నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు.

News December 11, 2024

గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం ఐడీఒసీ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, జాయింట్ రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

News December 11, 2024

మహబూబ్‌నగర్‌లో మృతదేహం కలకలం

image

గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మెయిన్ గేట్ పక్కన రూం సమీపంలో ఓ వ్యక్తి చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుంది. అతడి రెండు చేతులు కొట్టేసి ఉన్నాయి. ఎవరైనా గుర్తిస్తే 8712659312, 8712659334 నంబర్లకు సమాచారం ఇవ్వాలని 2-టౌన్ ఎస్ఐ తెలిపారు. ఇది హత్యనా.. ప్రమాదమా తెలియాల్సి ఉంది.