News March 17, 2024
MBNR: 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపటి నుండి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష ఉంటుంది. గతంలో నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండేది కాదు. ఈ సారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. అనుమతి ఇస్తారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు.
Similar News
News October 31, 2024
MBNR: మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు రానున్నాయా?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్లమెంటుకు రెండు స్థానాల చొప్పున, మొత్తంగా మరో నాలుగు నియోజకవర్గాలు ఏర్పాడనున్నాయి. జనాభా విస్తీర్ణం ప్రకారమైతే ఆరు అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు, నిపుణులలో చర్చలు జరుగుతున్నాయి. జనాభా, జిల్లా విభజన ప్రకారం అయితే ఈ సంఖ్య 20కి పెరగవచ్చని ప్రచారం సాగుతోంది.
News October 30, 2024
వనపర్తి: ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ సస్పెండ్
వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్‌ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభు వినయ్ అవినీతి, అక్రమాలపై పూర్తి ఆధారాలతో BC పొలిటికల్ JAC ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఎక్సైజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు ప్రభు వినయ్‌ను సస్పెండ్ చేశారు.
News October 30, 2024
నిర్ణీత సమయంలో కులగణన పూర్తి చేస్తాం: మంత్రి జూపల్లి
కులగణనను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గం ఎంతో నిష్పత్తి ప్రకారం వివరాలు సేకరిస్తామన్నారు. నవంబర్ 31 లోపు కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు ఉంటాయన్నారు. మూసి పరివాహక ప్రజలకు మేలు జరగడం BRS నేతలకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు.