News February 23, 2026

MBNR: 50 ఉద్యోగాలు.. రేపే ఉద్యోగ మేళా

image

మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 24న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 2 సంస్థల్లో 50 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. డిగ్రీ పాసై కంప్యూటర్‌లో అనుభవం ఉండాలని, వయసు 18-35లోపు ఉండాలని, బయోడేటా, ఆధార్, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఉమ్మడి జిల్లా అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News February 25, 2026

ఘోరం.. ఏడుస్తున్నాడని బిడ్డను నిప్పుల్లో వేసిన తల్లి

image

TG: బిడ్డ ఏడిస్తే ఓర్పుగా లాలించాల్సిన తల్లే సహనం కోల్పోయి దారుణానికి పాల్పడింది. 2 రోజులుగా బిడ్డ ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల పసికందు నోట్లో గుడ్డలు కుక్కేసి, కాళ్లు, చేతులు కట్టేసి నిప్పుల్లో పడేసింది. దీంతో ఆ బిడ్డ సజీవ దహనమయ్యాడు. ఈ అమానవీయ ఘటన మేడ్చల్(D) దుండిగల్‌లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లి మమత మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. MPకి చెందిన ఈమె భర్తతో కలిసి వలస వచ్చింది.

News February 25, 2026

మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

image

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.

News February 25, 2026

డయేరియా, కల్తీ పాల ఘటనలపై సీఎం సమీక్ష

image

AP: శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాల ఘటనలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. శ్రీకాకుళం ఘటనలో 76 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.