News April 10, 2024
MBNR: 68,875 మందికి చెక్కర పంచాల్సిందే.. !
MBNR: చౌకధర దుకాణాల్లో ఇక నుంచి చక్కెర తప్పనిసరిగా పంపిణీ చేయాలని డీలర్లను పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఉచిత బియ్యంతోపాటు పంచదార ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2023 చౌక దుకాణాలు ఉన్నాయి. AAY లబ్ధిదారులు 68,875 మంది ఉన్నారు. వీరికి ప్రతినెల కిలో చొప్పున చక్కెర పంపిణీ చేయాలంటే ఉమ్మడి జిల్లాకు గోదాము నుంచి 96.88 టన్నుల దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 23, 2024
MBNR: జిల్లాలో పెరిగిన చలి పులి
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొన్నటితో పోలిస్తే చలి తీవ్రత పెరిగింది. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయాన్నే స్నానాలు చేసి బడికి వెళ్లే విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. గత 24 గంటలలో గద్వాల జిల్లా ఇటిక్యాల మం. సాతర్ల గ్రామంలో 18.0, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మం. కేంద్రంలో 15.7, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మం. తోటపల్లి 16.7, వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో 18.1డిగ్రీల కనిష్ఠ నమోదయ్యాయి.
News December 23, 2024
పాలమూరులో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం
పాలమూరు జిల్లాలో సంతానం లేక బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటుచేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. కాగా ఇప్పటివరకు హైదరాబాద్లోని గాంధీ, పేట్ల బురుజు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుతుండగా ఇకపై పాలమూరులోనూ అందనున్నాయి. డబ్బు ఖర్చు చేసే స్తోమత లేని వారికి ప్రభుత్వ నిర్ణయం ఉపయోగకరం కానుంది.
News December 23, 2024
MBNR: స్థానిక పోరు..3,836 వార్డులు!
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన మండలాలతో కలిపి 16 మండలాలు ఉన్నాయి. వీటిలో 441 గ్రామ పంచాయతీలు, 3,836 వార్డులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తూ.. ఓటు వేసేందుకు ఇబ్బందులు లేకుండా గ్రామానికి దగ్గరగా ఉండే భవనాలను ఎంపిక చేశారు.గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా
సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.