News January 5, 2026

MBNR: 87126 59360.. SAVE చేసుకోండి

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తుతో పాటు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే ‘డయల్ 100/112’ లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబరు 87126 59360కు సమాచారం అందించాలని ఆమె కోరారు.

Similar News

News January 9, 2026

MBNR: పిల్లలతో బైక్‌లపై వెళ్లేటప్పుడు తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

image

చిన్న పిల్లలను బైకులపై తీసుకెళ్లేటప్పుడు పిల్లలను ముందు కూర్చోబెట్టుకోవడం ప్రమాదకరమని MBNR జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. సంక్రాంతి వేళ ఎగురవేసే గాలిపటాల దారాలు వాహనదారుల మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని, పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, నెమ్మదిగా వాహనాలను నడుపుతూ తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

News January 9, 2026

ఫిబ్రవరి 3 పాలమూరుకు సీఎం రాక

image

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3న సీఎం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో భాగంగా తొలి సభను పాలమూరులో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై నిరసనతో పాటు, ఎన్నికల వ్యూహాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

News January 8, 2026

మహబూబ్ నగర్: భార్యాపిల్లల దాడిలో భర్త దారుణ హత్య

image

మహబూబ్‌నగర్ జిల్లాలో కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పండ్ల వ్యాపారి విస్లావత్ రాములు (56)ను భార్య, పిల్లలే కలిసి కర్రలు, రాడ్లతో కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి గొడవ ముదరడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులు కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.