News November 30, 2024

MBNR: 9 నెలల్లో 50 వేల GOVT ఉద్యోగాలిచ్చాం: టీపీసీసీ చీఫ్

image

తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వంలో రైతులు కన్నీరు పెడుతుంటే.. KCR ఫామ్ హౌస్‌లో పన్నీరు తిన్నాడని మండిపడ్డారు. పదేళ్లలో KCR 50 వేల GOVT ఉద్యోగాలిస్తే తాము కేవలం 9 నెలల్లో 50 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే పని చేస్తుందని చెప్పారు.

Similar News

News November 1, 2025

MBNR: విద్యుత్ షాక్‌తో డిగ్రీ విద్యార్థి మృతి

image

కరెంటు షాక్‌తో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోప్లాపూర్‌లో నిన్న రాత్రి జరిగింది. కుటుంబసభ్యులు వివరాలు.. గ్రామానికి చెందిన సావిత్రి, తుల్జానాయక్‌కు కుమారుడు కార్తీక్, ఓ కుమార్తె ఉన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి కార్తీక్ నీరు పడుతుండగా కరెంట్ షాక్ గురయ్యాడు. స్థానికులు గుర్తించి జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.

News October 31, 2025

బాదేపల్లి మార్కెట్‌లో పంట ధరలు

image

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు శుక్రవారం మొక్కజొన్న 2,695 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,007, కనిష్ఠ ధర రూ.1,600 పలికింది. ఆర్‌ఎన్‌ఆర్‌ వడ్లు 130 క్వింటాళ్లు రాగా, గరిష్ఠ ధర రూ.2,089, కనిష్ఠ ధర రూ.1,739గా నమోదైంది. జొన్నలు క్వింటాలుకు గరిష్ఠంగా రూ.1,701, రాగులు క్వింటాలుకు గరిష్ఠంగా రూ.3,777 లభించాయి.

News October 31, 2025

MBNR: U-17 రగ్బీ.. NOV 3న ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-17 విభాగంలో రగ్బీ ఎంపికలు ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. మహబూబ్ నగర్‌లోని స్టేడియం గ్రౌండ్‌‌లో నవంబర్ 3న అండర్-17 విభాగంలో బాల, బాలికల రగ్బీ ఎంపికలు ఉంటాయని, ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలని, ఆసక్తి గల క్రీడాకారులు స్కూల్ ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలన్నారు.