News January 25, 2025
MBNR: BC స్టడీ సర్కిల్.. APPLY చేసుకోండి.!

ఉమ్మడి బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ అభివృద్ధి అధికారి ఆర్.ఇందిర, డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. MBNR, NGKL, NRPT జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 12,13,14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 22, 2025
కన్నుల పండువగా కురుమూర్తి స్వామి కళ్యాణ మహోత్సవం

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో కమనీయంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి గిరులు “కురుమూర్తి వాసా గోవింద” నామ స్మరణతో మార్మోగాయి.
News October 22, 2025
రేపు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల కోఆర్డినేషన్ మీటింగ్

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు కోనేరు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లు సహా తదితర ముఖ్య అంశాలపై సమీక్షించనున్నారు.
News October 21, 2025
పాలమూరు వర్శిటీ.. దేశవ్యాప్తంగా వినిపించాలి:VC

పాలమూరు వర్శిటీ పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా పథకాలు సాధించాలని వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆర్చరీ పురుషుల జట్టుకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. సౌత్ జోన్(ఆల్ ఇండియా ఇంటర్ వర్శిటీ) టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆర్చరీ జట్టు గురుకాసి వర్శిటీ పంజాబ్కు బయలుదేరారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, అసోసియేట్ ప్రొ.డాక్టర్ ఎన్.కిషోర్,PD శ్రీనివాసులు పాల్గొన్నారు.