News May 11, 2024
MBNR: BRS రాష్ట్రాన్ని దోపిడీ చేసింది: డిప్యూటీ సీఎం బట్టి

పదేళ్లు అధికారంలో ఉన్న BRS రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. గద్వాల జిల్లా అయిజలో శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. BRS నేతలు కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లు దోచుకున్నారని, ప్రభుత్వ ఖజానాకు రూ. 7లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. BRS రాష్ట్రాని దోచుకుంటే, BJP దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టారని విమర్శించారు.
Similar News
News October 24, 2025
దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్య

దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు(40) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శక్రవారం వెలుగు చూసింది. మైబు హమాలి పని ముగించుకొని గురువారం రాత్రి 9:30 గంటలకు బైక్ పై ఇంటికి వెళ్తుండగా అడవి అజిలాపూర్ గేటు సమీపంలో గుర్తుతెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News October 24, 2025
పాలమూరు: టపాసులు పేలి విద్యార్థులకు గాయాలు

టపాసులు పేలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. పాలమూరు రూరల్ రేగడిగడ్డ తాండ పంచాయతీ పరిధిలోని ప్రైమరి పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఉదయం క్లాస్ బయట టపాసులు పేల్చారు. అవి పేలడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సమయంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.
News October 23, 2025
MBNR: నేర సమీక్ష.. కేసుల దర్యాప్తుపై ఎస్పీ దృష్టి

మహబూబ్నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో క్రైమ్ కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిపై ఆరా తీశారు. మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


