News June 5, 2024
MBNR: BRS ఓటు BJPకి షిఫ్ట్

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 6 నెలల వ్యవధిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న BJP వేగంగా పుంజుకుంది. MBNRలో విజయం సాధించింది. NGKLలో రెండో స్థానంలో నిలవడమే కాక రికార్డు స్థాయిలో ఓట్లు సాధించింది. దీనికి కారణం ప్రధాన ప్రతిపక్షమైన BRS ఓటు బ్యాంక్ చివరి క్షణంలో BJP వైపు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది.
Similar News
News February 5, 2026
MBNR: బాలానగర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో బాలానగర్ మండల కేంద్రంలో 14.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 15.0, గండీడ్ మండలం సల్కర్ పేట 15.2, మిడ్జిల్ మండలం దోనూరు 15.4, జడ్చర్ల 15.5, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.6, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ లో 16.0, మిడ్జిల్ 16.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.
News February 4, 2026
ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమ అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన: డీఈఓ

మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమ అమలు తీరును డీఈఓ ప్రవీణ్ కుమార్ బుధవారం పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థుల చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు, మాక్ టెస్ట్ ఫలితాలు, యాక్షన్ ప్లాన్ అమలును సమీక్షించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక సాధన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News February 4, 2026
పాలమూరు అభివృద్ధికి రూ.300 కోట్లు మంజూరు: డీకే అరుణ

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. బుధవారం ఎంవీఎస్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సమ్మేళనం సభలో ఆమె మాట్లాడారు.. విమానాశ్రయాలకు దీటుగా అన్ని జిల్లాలలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.


