News October 26, 2025
MBNR: BRS విజయం.. అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్

HYDలోని MTAR Technologies Ltd కంపెనీలో భారత రాష్ట్ర సమితి నుంచి కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పై గెలుపొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Similar News
News October 26, 2025
విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. తప్పిన ప్రమాదం

సౌదీ అరేబియాకు చెందిన SV340(Boeing 777-300) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. జెడ్డా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పక్షుల గుంపు ఢీకొట్టింది. అక్కడ పక్షుల రక్తపు మరకలు అంటుకున్నాయి. ముందరి భాగం దెబ్బతింది. ల్యాండింగ్ సేఫ్టీనే అని పైలట్ నిర్ధారించుకుని ల్యాండ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు గుర్తించారు. పక్షులు ఇంజిన్‌లోకి వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.
News October 26, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. గడ్కరీకి సోనూసూద్ రిక్వెస్ట్

కర్నూలు బస్సు ప్రమాదంపై నటుడు సోనూసూద్ స్పందించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రిక్వెస్ట్ ట్వీట్ చేశారు. ‘ప్రతి లగ్జరీ బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎలక్ట్రానిక్ కాకుండా మాన్యువల్ పెట్టాలి. ఆపరేటర్లకు నెల సమయం ఇవ్వండి. పర్మిట్ రెన్యూవల్ సమయంలో ఆపరేటర్లు డోర్ మార్చినట్లు ఫొటోలు అప్లోడ్ చేయాలని చెప్పండి. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకండి సార్’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
News October 26, 2025
పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే: కోమటిరెడ్డి

రాష్ట్రంలో హ్యామ్ విధానంలో చేపట్టబోయే రూ.8 వేల కోట్ల రోడ్ల పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టారు. “పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది” అంటూ బీఆర్‌ఎస్ నేతల విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాణ్యమైన రోడ్లు వేస్తుంటే ప్రతిపక్షం అడ్డుకుంటోందని ఆరోపించారు.


