News September 27, 2024

MBNR: CM ఇలాకాలో ప్రభుత్వ పాఠశాలలకు అల్పాహారం

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారం అందించేందుకు వయాట్రిస్, HKM ఛారిటబుల్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో 312 పాఠశాలల్లోని 28వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందివ్వనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వయాట్రిస్ రూ.6.4 కోట్ల విరాళాన్ని అందజేసింది. హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థులకు అల్పాహారం అందివ్వనుంది.

Similar News

News November 11, 2025

MBNR: ‘అంగన్‌వాడీ పనితీరు మెరుగుపడాలి’

image

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీఓలు, సూపర్ వైజర్‌లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచాలని అన్నారు. గ్రామాల్లో కేంద్రాలకు ఎంత మంది హాజరవుతున్నారనే అంశంపై స్పష్టత ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News November 11, 2025

మహిళలకు స్వయం ఉపాధి ఉచిత శిక్షణ

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. టైలరింగ్, బ్యూటీ పార్లర్ కోర్సుల్లో ఉచిత భోజన వసతితో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News November 11, 2025

మూసాపేట: పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం మూసాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. బోర్డుపై ఉన్న వర్ణమాల, సరళ పదాలను విద్యార్థులతో చదివించి తెలుసుకున్నారు. అక్షయపాత్ర ద్వారా అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.