News November 29, 2024
MBNR: DEC నుంచి DEGREE, PG తరగతులు ప్రారంభం
మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ సెమిస్టర్-1,3,5, పీజీ ప్రథమ,ద్వితీయ సంవత్సరం తరగతులు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మావతి, రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. హాజరయ్యే విద్యార్థులు ఐడి కార్డ్, ఫీజు చెల్లించిన రసీదులు తప్పక తీసుకురావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 29, 2024
MBNR: ఆస్పత్రిలో బాలింత మృతి.. నర్సులపై వేటు
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో<<14731958>> బాలింత మృతి<<>> ఘటనలో ఇద్దరు నర్సులను వైద్యాధికారి సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గండీడ్ మం. ఆసిరెడ్డిపల్లికి చెందిన రజిత కాన్పుకోసం బుధవారం ఆస్పత్రిలో చేరారు. రాత్రి బిడ్డకు జన్మనించిన ఆమె.. గురువారం ఉదయం చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తామన్న హామీతో ఆందోళన విరమించారు.
News November 29, 2024
MBNR: ఇంటర్ విద్య పరిశీలనకు విద్యా కమిషన్
రాష్ట్రంలో తెలంగాణ విద్యా కమిషన్ విస్తృతంగా పర్యటిస్తోంది. వచ్చే నెల 7 వరకు ఉమ్మడి MBNR జిల్లాల్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఉన్న ఇంటర్ అధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ సహకారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News November 29, 2024
MBNR: ఉమ్మడి జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిరుద్యోగులకు ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ(SBRSETI) గుడ్ న్యూస్ తెలిపింది. హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 7 వరకు దరఖాస్తులు చేసుకోవాలని, 19 నుంచి 45 సంవత్సరాలు ఉన్నవారు అర్హులని, మిగతా వివరాల కోసం 95424 30607, 99633 69361 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.