News August 28, 2024
MBNR: DSC 508 ఖాళీలు..14,577 మంది ఎదురుచూపు !
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 508 ఖాళీలకు గాను..14,577 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆగస్టు 13న విడుదల చేసిన ప్రాథమిక కీపై రాష్ట్ర వ్యాప్తంగా 28,500 అభ్యంతరాలు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరు నాటికి తుది కీ ప్రకటించి ఫలితాలు విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. MBNR-1:27, NGKL-1:29, GDWL-1:40, NRPT-1:19, WNPT-1:40 జిల్లాల్లో నిష్పత్తిలో పోటీ నెలకొంది.
Similar News
News September 16, 2024
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద
శ్రీశైలం జలాశయంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 883.30 అడుగులు, నీటి నిల్వ 206,0906 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 41,287 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 68,194 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.
News September 16, 2024
MBNR: 11ఏళ్ల నిరీక్షణకు తెర.. బదిలీలపై టీచర్ల సంతోషం
ఆదర్శ పాఠశాలల్లో ఎట్టకేలకు 11ఏళ్ల తర్వాత బదిలీలు చేపట్టడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఈ పాఠశాలలు ప్రారంభించగా.. అప్పటి నుంచి బదిలీలు చేపట్టలేదు. తాజాగా విద్యాశాఖ PGT, TGTలను పాత జోన్ల ప్రకారం బదిలీలు చేసింది. దీంతో ఆదర్శ పాఠశాలల్లో మొత్తం 160 ఖాళీలు ఉన్నాయి. సెలవు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల పలువురు ఆందోళనకు గురయ్యారు.
News September 16, 2024
‘ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి’
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని పీయూ అధ్యాపకులు ఎంపీ డీకే అరుణకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పీయూలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను ఆమె దర్శించుకున్నారు. విద్యార్థి సంఘ నాయకులు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12 యూనివర్సిటీల్లో 1445 మంది అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారని, తమను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.