News March 18, 2024
MBNR: PUలో ఇంజినీరింగ్, న్యాయ కళాశాలలు

పీయూ ప్రాంగణంలో కొత్తగా న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. న్యాయ కళాశాలలో మూడేళ్ల పాటు 60 సీట్లు, LLMలో 20 సీట్లు, ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తో పాటు నాలుగు కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కోర్సులో 60 మందికి ప్రవేశం కల్పించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కళాశాలలు నిర్వహించేందుకు చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News March 31, 2026
మహబూబ్‌నగర్: 290 కోట్ల మంది ఉచిత ప్రయాణం: కలెక్టర్

మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని కలెక్టర్ కుష్బూ గుప్తా తెలిపారు. రూ.10,000 కోట్ల ఛార్జీల మైలురాయిని చేరిన సందర్భంగా మంగళవారం బస్టాండ్‌లో ఉత్సవాలు నిర్వహించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
News March 31, 2026
పాలమూరు: జాబ్ మేళా.. 120 మంది హాజరు

మహబూబ్ నగర్ లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 6 సంస్థలలో మొత్తం 500 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 120 మంది నిరుద్యోగులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు. వివిధ సంస్థల సభ్యులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
News March 31, 2026
MBNR: ఏప్రిల్ 1 నుంచి అంబేడ్కర్ వర్సిటీ ప్రయోగ పరీక్షలు

మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి మొదటి సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ సూచించారు. వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించవచ్చు.


