News March 18, 2024
MBNR: పాలమూరులో విస్తరిస్తోంది !

పాలమూరు జిల్లాలో కుష్టువ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వ్యాధి పట్టణాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు జిల్లాలో ఈనెల 11 నుంచి 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సర్వేలో స్పర్శలేని ఎర్రని రాగి రంగు, గోధుమ రంగు మచ్చలు పరిశీలించడం, కాళ్లు, చేతులు మొద్దుబారడం వాటిని పరిశీలిస్తారని, సిబ్బందికి సహకరించాలని ప్రజలకు DMHO కృష్ణ సూచించారు.
Similar News
News November 12, 2025
MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్ 14.3, మిడ్జిల్ 14.5, రాజాపూర్ 14.6, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 12, 2025
MBNR: ‘కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి’

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్, బ్యానర్ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.
News November 12, 2025
రాజ్‌కోట్ నుంచి మహబూబ్‌నగర్‌కు పీయూ ఎన్ఎస్ఎస్ బృందం

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో విజయవంతంగా నిర్వహించిన ప్రీ రిపబ్లిక్ డే నేషనల్ క్యాంప్‌ను పూర్తి చేసుకుని, పీయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ బృందం మంగళవారం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి మహబూబ్‌నగర్‌కు బయలుదేరింది. ఈ బృందం మంగళవారం రాత్రి కాచిగూడ చేరుకుంటుందని పీయూ అధికారులు తెలిపారు. ఈ క్యాంపులో డా.ఎస్.ఎన్.అర్జున్ కుమార్, డా.కె.కవిత కంటింజెంట్ లీడర్లుగా, పలువురు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.


