News October 25, 2025

MBNR: FREE కోచింగ్.. ఫోన్ చేయండి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. CCTV కెమెరా ఇన్సాలేషన్ & సర్వీస్ కోర్సులో ఉచిత శిక్షణ, వసతి ఇస్తున్నామని, వయసు 19-45లోపు ఉండాలని, ఆసక్తి గలవారు.. SSC MEMO, రేషన్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 30లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489కు సంప్రదించాలన్నారు.

Similar News

News October 26, 2025

MNCL: 27న మద్యం దుకాణాల కేటాయింపు

image

నూతన మద్యం పాలసీ విధానం 2025- 27లో భాగంగా మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పివిఆర్. గార్డెన్స్ లో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధ శాఖ అధికారి నందగోపాల్ తెలిపారు. దరఖాస్తుదారులు సకాలంలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.

News October 26, 2025

ఈ నెల 27న ఆదిలాబాద్‌లో జాబ్ మేళా

image

ఆదిలాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. అర్హులైన 17 నుంచి 25 ఏళ్ల పురుష అభ్యర్థులు (BSC/B.Com/B.A/M.P.C/B.i.P.C/MLT) ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9154679103, 9963452707 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

News October 26, 2025

పెద్దపులి తిరిగి తిప్పేశ్వర్ కు వరకు వెళ్లిందా..!

image

కొన్ని రోజుల క్రితం బోథ్ మండలాన్ని గడగడలాడించిన పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం లేదు. అది తిరిగి తన సొంతగూడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతానికి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం నిగిని, మర్లపల్లి అడవిలో కనిపించినట్లు అటవీ అధికారులు ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్య దాని ఆనవాళ్లు కనబడడం లేదు.