News March 16, 2025
MBNR: GET READY.. త్వరలో క్రికెట్ పండుగ!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటిసారిగా SGF ఆధ్వర్యంలో “జాతీయస్థాయి బాలుర అండర్-19 క్రికెట్ టోర్నీ” ఏప్రిల్ 25 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ టోర్నీలో సుమారుగా 40 రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. దీంతో పాలమూరుకు నూతన ఉత్సాహం నెలకొననుంది.
Similar News
News April 22, 2025
నేడే ఇంటర్ ఫలితాలు.. గద్వాలలో 8,341 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. గద్వాల జిల్లాలో మొత్తం 8,341 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 4,057, సెకండియర్‌లో 4,284 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. – ALL THE BEST
News April 22, 2025
ట్రంప్‌కు షాక్.. కోర్టుకెక్కిన హార్వర్డ్ యూనివర్సిటీ

యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌పై హార్వర్డ్ యూనివర్సిటీ మసాచుసెట్స్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. $2.2 బిలియన్ల <<16113020>>ఫండ్స్ <<>>నిలిపేస్తామని బెదిరింపులకు పాల్పడటంపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమైంది. యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలన్ గార్బర్ మాట్లాడుతూ ‘ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బలవంతంగా హార్వర్డ్‌ను తమ అధీనంలోకి తీసుకోవాలని చూస్తోంది. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు.
News April 22, 2025
నేడే ఇంటర్ ఫలితాలు.. NGKLలో 13,454 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 13,454 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 6,477, సెకండియర్‌లో 6,977 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.
– ALL THE BEST