News November 6, 2024
MBNR: GET READY.. నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేసి సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వెయ్యనున్నారు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News December 10, 2024
MBNR: తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో జిల్లా నాయకులు
హైదరాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతికగా చిత్రకారులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రముఖ నాయకులు, తదితరులు ఉన్నారు.
News December 10, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!
✔ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ✔పాలమూరులో పెరిగిన కోడి గుడ్ల ధరలు ✔తెలంగాణ తల్లి తొలివిగ్రహం.. మన పాలమూరులోనే ✔సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి:STU ✔గద్వాల: 13న ఐటీఐ అప్రెంటిస్ జాబ్ మేళా ✔Way2Newsతో JL సాధించిన అనిల్ కుమార్ ✔గ్రూప్-2 పరీక్ష.. ఏర్పాట్ల పై ఫోకస్ ✔NGKL: స్కూల్ అమ్మాయిలపై వేధింపులు.. ఇద్దరికి జైలు శిక్ష ✔విలేఖరులకు అండ TUWJ: మధు ✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్
News December 9, 2024
MBNR: జోగులాంబ ఆలయానికి భారీగా ఆదాయం
అలంపూర్ ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నేడు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో రూ.1,06,04,436 సమకూరింది. ఈ ఆదాయం ఐదు నెలలు తర్వాత లెక్కింపులో ఇంత భారీ ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.