News March 16, 2025

MBNR: GET READY.. త్వరలో క్రికెట్ పండుగ!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటిసారిగా SGF ఆధ్వర్యంలో “జాతీయస్థాయి బాలుర అండర్-19 క్రికెట్ టోర్నీ” ఏప్రిల్ 25 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ టోర్నీలో సుమారుగా 40 రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. దీంతో పాలమూరుకు నూతన ఉత్సాహం నెలకొననుంది.

Similar News

News March 17, 2025

జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య వార్తలు

image

జోగులాంబ :@ధరూర్ : LOC అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల.
@ఇటిక్యాల :RTC బస్సులను నిలపాలని వినతి.
@ఉండవెల్లి : మారమునగాలలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.
@రాజోలి : యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేయాలి.
@అలంపూర్ : మటన్ షాపులకు భారీగా పెరిగిన విక్రయాలు.
@ జిల్లాలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
@అయిజ: స్నేహితుడి వైద్యానికి ఆర్థిక సహాయం అందించారు.
@గద్వాల : ప్రజా సమస్యలను పరిష్కరించండి.సిపిఎం

News March 17, 2025

IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

image

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.

News March 17, 2025

అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

error: Content is protected !!