News March 16, 2025
MBNR: GET READY.. త్వరలో క్రికెట్ పండుగ!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటిసారిగా SGF ఆధ్వర్యంలో “జాతీయస్థాయి బాలుర అండర్-19 క్రికెట్ టోర్నీ” ఏప్రిల్ 25 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ టోర్నీలో సుమారుగా 40 రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. దీంతో పాలమూరుకు నూతన ఉత్సాహం నెలకొననుంది.
Similar News
News March 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 17, 2025
నల్గొండ: వచ్చే నెల నుంచే సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్

తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుంది అన్నారు. వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని, కాంగ్రెస్ మాటలు చెప్పేది కాదు, చేతల్లో చూపెడుతుందని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయబోతున్నామని అన్నారు.
News March 17, 2025
మార్చి17: చరిత్రలో ఈరోజు

*1892 : తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం.
*1896 : నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత మహిళ కల్పనా చావ్లా జననం
*1990: బాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం