News March 19, 2025
MBNR: GOOD NEWS.. నేడు ఉద్యోగ మేళ

మహబూబ్‌నగర్ జిల్లా నిరుద్యోగులు న్యూటౌన్‌లోని మల్లికార్జున్ ఎంటర్ప్రైజెస్ వెనుక ఉన్న ‘PMKK సెంటర్’లో ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ ఓ ప్రకటనలో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థల్లో 500 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, SSC, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై వారు సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వయస్సు 18-30 ఏళ్లలోపు ఉండాలన్నారు. వివరాలకు 9948568830, 9959635813లో సంప్రదించాలన్నారు.
Similar News
News March 20, 2025
MBNR: రంజాన్ మాసం.. హాలీమ్‌కు సలాం.!

రంజాన్ నెలలో దర్శనమిచ్చే నోరూరించే వంటకం హలీం. ఉపవాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పటికే ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, ఆయా మండలాల కేంద్రాల్లో హలీం సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మాంసం, గోధుమలు, పప్పుదినుసులు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో కలిపి ఉడికించి తయారు చేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇస్తారు.మీరు తింటే ఎలా ఉందో కామెంట్ పెట్టండి?
News March 20, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వైద్యులను ఆదేశించారు. బుధవారం మూసాపేట మండల పరిధిలోని జానంపేట పీ.హెచ్.సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల వైద్య చికిత్సను పరిశీలించి సమస్యలపై రోగులని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.
News March 20, 2025
మహబూబ్‌నగర్: 144 సెక్షన్ అమలు: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్-2023 (144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి బుధవారం తెలిపారు. 12,769 మంది విద్యార్థులకు 60 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు.